*శలాక పరీక్ష విధానము*
వేదవిద్యలో పరీక్షా విధానం చాలా క్లిష్టంగా ఉంటుంది. పరీక్ష అంతా కూడా మౌఖికంగానే జరుగుతుంది. అడిగిన ప్రతి ప్రశ్నకు ఎటువంటి దోషాలు లేకుండా పనస చెప్పవలసిందే!
ఇటువంటి పరీక్షా విధానంలో అత్యంత క్లిష్టమైనది శలాకపరీక్ష.
ఈ పరీక్షలో బ్రాహ్మణము 100 వాక్యాలు పదము 250 పదాలు తప్పు లేకుండా చెప్పాలి.ఆ చెప్పటంలో చెప్పిన అక్షరం మళ్ళీ చెప్పడం గానీ తడబడటం కానీ జరగకూడదు.బ్రాహ్మణం వాక్యం మధ్యలో ఆపటం పదం మధ్యలో ఆపటం చేయకూడదు.పనస పూర్తయిన తర్వాత అనువాకం పూర్తయిన తర్వాత పైన అందుకునే ఆపాలి.అసలైన కష్టం వరుసగా 100 వాక్యాలు 250 పదాల్ని జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటూ ఉండాలి,పొరపాటున ఒక చోట ఆపి ఇంకో చోట నుంచి మొదలు పెట్టినా కూడా పరీక్షతప్పినట్లే.చిన్న చిన్న అనువాకాలు వచ్చినప్పుడు ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది.పదంలో 15, 16, 17, 20, 25, 30 పదాలుకల అనువాకాలు చాలా ఉంటాయి.అవి వరసగా వచ్చినప్పుడు లెక్క పెట్టుకోవడం, పై అనువాకం చూసుకోవడం, ప్రధానమైన వరుస క్రమం తప్పకుండా చూసుకోవటం అంతా కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది.
చివరిగా "విద్వానేవవిజానాతి విద్వజ్జన పరిశ్రమం" అన్నట్లుగా అధ్యయనం చేసిన వారికే దీని యొక్క లోతుపాతులు - చెప్పటంలో సంక్లిష్టతలు అర్థం అవుతాయి.

Blogger Comment
Facebook Comment