భరతజాతి వెలుగురేఖ- విద్యారణ్యులు
2019 sakshi
భారతదేశంపై విదేశీ దండయాత్రలు జరుగుతున్న రోజులవి...! స్వధర్మానికి, సంస్కృతికి ఆపద వాటిల్లిన ఆ తరుణంలో ఓ వెలుగు రేఖ ఉదయించింది. భారతజాతిలో తిరిగి స్వధర్మ స్ఫూర్తిని నింపింది. ఆ వెలుగు రేఖయే శ్రీ విద్యారణ్య స్వామి.
మనదేశంలో ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరుకున్న గురువులకెప్పుడూ కొదవలేదు. అవసరమైన సందర్భాలలో పాలకులకు, ప్రజలకు మార్గనిర్దేశం చెయ్యడమేకాక, మన సంస్కృతి, సంప్రదాయాలని కాపాడుతూ తరువాతి తరాలకి అందజేస్తూ వచ్చారు. మన నాగరికత ఇన్ని వేల సంవత్సరాలుగా, అవిచ్చిన్నంగా కొనసాగడం వెనుక గురువుల ప్రభావం ఎంతో ఉంది. అటువంటివారిలో అగ్రగణ్యులు శ్రీవిద్యారణ్యులు.
*****
"దేశంకోసమే దేహం"
మీ జీవిత లక్ష్యం ఏమిటీ అన్నగురువుగారి ప్రశ్నకు సమాధానంగా దేశ స్వాతంత్ర్య రక్షణకు నా జీవితాన్ని అంకితం చేస్తాను అన్నాడు మాధవుడనే పిల్లవాడు. సమాధానం విన్న గురువులు ఆశ్చర్యపోయారు. సమాజ సేవ కోసం , ధర్మరక్షణ కోసం, నువ్వు నీ జీవితాన్ని అంకితం చేయడం చాలా గొప్ప విషయం. నీకు తప్పక విజయం లభిస్తుందని ఆశీర్వదించారు. గురువుల ఆశీర్వాదం పొందిన మాధవాచార్యుడు అనంతర కాలంలో శృంగేరీ పీఠాధిపతులైన శ్రీ భారతీ కృష్ణ తీర్థ స్వామి వారి వద్ద సన్యాసదీక్ష తీసుకుని శ్రీ విద్యారణ్య స్వామి వారిగా ప్రసిద్ధి చెందారు.
*****
"వేదాలకు భాష్యం"
విద్వాంసుల్లో అగ్రగణ్యులైన విద్యారణ్యులు మనిషిలో అంతర్లీనంగా ఉన్న దైవీ తత్వాన్ని దేదీప్యమానంగా వెలిగించుకోవడానికి అవసరమైన విజ్ఞతను తన గ్రంథాల ద్వారా అందించేందుకు నడుంబిగించి సోదరుడైన సాయనాచార్యుల సహకారంతో ‘వేదార్ధాన్ని’ వ్రాసారు. పాలకులు ఆచరించాల్సిన విషయాలు చెప్పడానికి వేదభాష్యం ఓ మార్గంగా ఆయన అభిప్రాయపడ్డారు. సామాన్యులకు మింగుడుపడని గంభీరమైన వేదాంత శాస్త్రాన్ని సులభంగా వివరించేందుకు పంచదశి అనే గ్రంధాన్ని రాసారు. అద్వైత తత్త్వాన్ని బోధించే గ్రంథంగా దీనికి ఎనలేని ప్రాధాన్యత ఉన్నది. సర్వదర్శన సంగ్రహం అనే పేరుతో భారతదేశంలో ఉన్న సమస్త విజ్ఞానాల సారాలను అతి సులభంగా అర్థమయ్యేలా రచించారు. ఇవేగాక శంకర దిగ్విజయం, ప్రాయశ్చిత సుధానిధి మొదలైన గ్రంథాలెన్నింటినో అందించారు.
*****
"విద్యారణ్యుడు బ్రహ్మయా? కాని నాలుగు ముఖాలు కనిపించడం లేదే. విష్ణువా? నాలుగు చేతులు కనిపించడం లేదే. శివుడా? మూడో నేత్రం కనిపించడం లేదే. ఇదంతాకాదు.... విద్యారణ్యుడు భగవంతుడు పంపిన ఒక అద్వితీయమైన శక్తి " అంటారో సందర్భంలో హరిహర రాయలవారు. జాతిని జాగృతం చేసిన విద్యారణ్యుల వారి జీవితాన్ని పరిశీలిస్తే ఈ మాటలు సత్యమేనని నిరూపితమవుతాయి.
అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని
వేదపండితులు

Blogger Comment
Facebook Comment