ప్రజ్ఞాపూర్ణులు-మధ్వాచార్యులు
29 may 2019 sakshi
అక్షరాలు నేర్పుదామనుకున్న తండ్రికి ఆశ్చర్యకరంగా శాస్త్రాల మర్మాలన్నింటినీ విడమరచిచెప్పాడు. చిన్ననాటినుండే తాను మానవమాత్రుడ్ని కానని తన అసమాన ప్రతిభా పాటవాలతో పరోక్షంగా సందేశాన్నిచ్చాడు. హనుమంతుడు, భీముడి తరువాత వాయుదేవుని మూడవ అవతారంగా శిష్యులచేత ఆరాధింపబడే ఆయనే ద్వైత మత ప్రవర్తకులు శ్రీమధ్వాచార్యులు.
చిన్నవయస్సులోనే సకల శాస్త్రాలలో జ్ఞానం సంపాదించుకున్న వాసుదేవుడనే బాలుడి మేధస్సును చూసి ముచ్చటపడిన గురువుగారు పూర్ణప్రజ్ఞుడనే బిరుదును ప్రసాదించారు. అద్వైతం, విశిష్టాద్వైతం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న కాలంలో ఆ రెండింటిని కాదని ఒక స్వతంత్రమైన సిద్ధాంతాన్ని ప్రవచించి దాన్ని తన వాదనా పటిమతో జన సామాన్యంలో ఆమోదయోగ్యంగా చేయడం సామాన్యులకు సాధ్యమయ్యేదికాదు. అటువంటి పనిని సుసాధ్యం చేసినందులకు లోకమంతా ఆయనను మధ్వాచార్యులుగా కీర్తించింది. వీరు యజ్ఞయాగాదులలో అనేక సంస్కారాలు ప్రవేశపెట్టారు. ఆచార్యత్రయంలో ఆదిశంకరులు, రామానుజుల తరువాత మూడవవారుగా ఖ్యాతి గాంచారు.
***
"ఒక్కటికాదు రెండు...."
తాత్త్వికలోకాన్ని ప్రభావవంతం చేసిన సిద్ధాంతం ద్వైతం. అతివాద మితవాదాలకు మధ్యే మార్గంగా శ్రీమధ్వాచార్యులు దీనిని ప్రతిపాదించారు. జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంతే సత్యమన్నతత్వవాదాన్నిదీనిద్వారా ఆచార్యులవారు అనుసంధానించారు. ధర్మమార్గంలో, ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఉద్భోధించారు.
***
"హరి సర్వోత్తముడు"
భక్తి జ్ఞాన వైరాగ్యాలతోపాటు కర్తవ్య కర్మ ఆచరించమనే మధ్వసంప్రదాయంలో విష్ణువే సర్వోత్తముడు. అంటే అందరికంటే ఉన్నతుడైనప్పటికీ, శివారాధననుకూడా అర్చనాసంప్రదాయంలో ఒకభాగంగా మలిచారు మధ్వాచార్యులవారు. భారత భాగవతాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకే కాకుండా ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలకు కూడా వ్యాఖ్యానం వ్రాసారు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించి ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించారు. వీరి రచనలలో మహాభారత తాత్పర్యనిర్ణయం అనే గ్రంథం ప్రఖ్యాతి గాంచింది.
***
" శ్రీకారం చుట్టింది తెలుగునాటనే..."
భక్తిప్రధానమైన శ్రీమద్భాగవతం వీరిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపించింది. దాంతో సులభతరమైన భక్తిమార్గాన్ని ఆయన తన శిష్యులకు ఉపదేశించారు. ఆయన చెప్పిన సిద్ధాంతానికి ఆకర్షితులైన రాజమహేంద్రవరంలో ఇద్దరు పండితులు ద్వైతాన్ని అంగీకరించడంతో ద్వైతంయొక్క వ్యాప్తి మొదలైంది. తదనంతరకాలంలో విస్తృతంగా దేశమంతా పర్యటించి ద్వైతసిద్ధాంతాన్ని ప్రచారం చేసినా ఈ సిద్ధాంతం పురుడుపోసుకున్నది మాత్రం తెలుగునేలపైనే కావడం విశేషం.
***
"భక్తి.... ముక్తిదాయకం"
మధ్వాచార్యులవారు సాక్షాత్తూ రుక్మిణీ దేవి పూజించేదిగా భావించే బాలకృష్ణుని విగ్రహాన్ని ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు. సుప్రభాతం మొదలుకుని వివిధ అర్చనాసేవలు అనునిత్యం నిర్విరామంగా కొనసాగేందుకు వీలుగా ఎనిమిది మఠాలను స్థాపించి, వాటికి ఎనిమంది తీర్థులను ప్రతినిధులుగా చేశారు. వారు ఆయా పీఠాలకు అధిపతులై గురువుల ఆజ్ఞ మేరకు ఒకరి తరువాత మరొకరు ‘పర్యాయ’ క్రమంలో శ్రీకృష్ణుని సేవలను నిర్వహిస్తు క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు.
***
అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని
వేదపండితులు

Blogger Comment
Facebook Comment