పిల్లాపాప ఆనందకేళీ..
దీపాల వరుసలతో లక్ష్మీదేవికి నీరాజనాలను సమర్పించే రోజు కాబట్టి దీపావళి అనేపేరు ఏర్పడిరది. సనాతన సంప్రదాయానికి దీపావళి ఒక అద్భుత నిదర్శనం. ఈనాడు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి అందరి ఇండ్లకు వెలుతుందని, అందుకే ఈనాడు ఇండ్లను దీపాతో అంలంకరించుకొని ఆ మహాలక్ష్మికి దారిచూపాలని చెబుతారు.
ఈపండుగను మూడురోజులుగా ఆచరిస్తారు. మొదటిరోజు నరకచతుర్దశీ, రెండవరోజు దీపావళి, చివరిరోజు
బలి ప్రతిపద. శ్రీకృష్ణుడు నరకచతుర్దశినాడే నరకాసురుడ్ని వధించాడని అందుకే దీనికి ఆపేరు వచ్చిందని పెద్దలమాట. నరకాసురని పీడ విరగడైనందుకు గుర్తుగా...ఈనాడు ఉదయాత్పూర్వమే ఆడపడచులతో నీరాజనాలను తీసుకొని వారికి కట్నకానుకలను ఇచ్చి సంతోషపెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఇలాచేస్తే పీడలు తొలుగుతాయని నమ్మకం.
మహాలయపక్షంలో తమ వారసులు సమర్పించే పిండదానాదులను స్వీకరించడానికి భూలోకానికి విచ్చేసిన పితృదేవతలు తిరిగి వారిలోకాలకు వెళ్ళేందుకై దారిచూపుతూ కోలలను త్రిప్పుతారు. తద్వారా గండాలన్నీ తొలుగుతాయి. నరకచతుర్దశితో ఈసంబరం ముగుస్తుంది. ఈ ఆచారం ఈనాటికీ తెంగాణలోని పలు ప్రాంతాలో ఉన్నది.
ఇకరెండవదైన దీపావళినాడు లక్ష్మీదేవి ప్రీతికొరకై లక్ష్మీపూజను నిర్వహిస్తారు. తద్వారా మహాలక్ష్మీ అనుగ్రహంతో సిరిసంపదలు కలుగుతాయని శాస్త్రవచనం. చిన్ననుండి పెద్దదాకా ఆనందంతో టపాసులు పేల్చుతారు. తద్వారా లక్ష్మీదేవికి ఘనంగా వీడ్కోలు చెబుతారు.
టపాసులు పేల్చడమనే వేడుక ఈనాడు వికృతరూపు దాల్చింది. ఒకరికంటే మరొకరు పోటీపడుతూ ఎక్కువ శబ్దం చేయడమే లక్ష్యంగా టపాసులను పేల్చడంతో పండుగనాడు చెవులు మూసుకునే పరిస్థితి కలుగుతోంది. కానీ మన సంప్రదాయం ఇలా చెప్పలేదు. శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఆచరించిననాడు మనం దాని ఫలితాన్ని పొందడమేకాకుండా.... పర్యావరణానికికూడా ఎంతో మేలు చేసినవారమవుతాము.

Blogger Comment
Facebook Comment