శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులియరమ్మ|
నోచిన వారికి - నోచిన వరము,
చూసిన వారికి - చూసిన ఫలము||
శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ||
స్వామిని పూజించే - చేతులే చేతులట,
ఆ మూర్తిని దర్శించే - కనులే కన్నులట;
తన కథ వింటే ఎవ్వరికయినా ...
జన్మ తరించునటా...||1|| || శ్రీ సత్యనారాయణుని||
ఏ వేళ అయినా - ఏ శుభమైనా,
కొలిచే దైవం - ఈ దైవం;
అన్నవరం లో వెలసిన దైవం,
ప్రతి ఇంటికి దైవం....||2|| || శ్రీ సత్యనారాయణుని||
అర్చణ చేదామా - మనసు అర్పణ చేదామా,
స్వామిని మదిలోనే - కోవెల కడదామా;
పది కాలాలు పసుపు కుంకుమలు...
ఇమ్మని కొరేనా ...||3|| || శ్రీ సత్యనారాయణుని||
మంగళమనరమ్మా - జయ మంగళమనరమ్మా,
కరములు జోడించి - శ్రీ నందనమలరించి;
మంగళమగు - శ్రీ సుందర మూర్తికి...
వందన మనరమ్మా... ||4|| || శ్రీ సత్యనారాయణుని||
నోచిన వారికి - నోచిన వరము,
చూసిన వారికి - చూసిన ఫలము || || శ్రీ సత్యనారాయణుని||
మనసారా స్వామిని కొలిచి హారతులియరమ్మ|
నోచిన వారికి - నోచిన వరము,
చూసిన వారికి - చూసిన ఫలము||
శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ||
స్వామిని పూజించే - చేతులే చేతులట,
ఆ మూర్తిని దర్శించే - కనులే కన్నులట;
తన కథ వింటే ఎవ్వరికయినా ...
జన్మ తరించునటా...||1|| || శ్రీ సత్యనారాయణుని||
ఏ వేళ అయినా - ఏ శుభమైనా,
కొలిచే దైవం - ఈ దైవం;
అన్నవరం లో వెలసిన దైవం,
ప్రతి ఇంటికి దైవం....||2|| || శ్రీ సత్యనారాయణుని||
అర్చణ చేదామా - మనసు అర్పణ చేదామా,
స్వామిని మదిలోనే - కోవెల కడదామా;
పది కాలాలు పసుపు కుంకుమలు...
ఇమ్మని కొరేనా ...||3|| || శ్రీ సత్యనారాయణుని||
మంగళమనరమ్మా - జయ మంగళమనరమ్మా,
కరములు జోడించి - శ్రీ నందనమలరించి;
మంగళమగు - శ్రీ సుందర మూర్తికి...
వందన మనరమ్మా... ||4|| || శ్రీ సత్యనారాయణుని||
నోచిన వారికి - నోచిన వరము,
చూసిన వారికి - చూసిన ఫలము || || శ్రీ సత్యనారాయణుని||
Blogger Comment
Facebook Comment