విద్యల‌కు సిద్ధి.....సరస్వతీ

విద్యల‌కు సిద్ధి.....సరస్వతీ





శ్లో॥ మాణిక్యవీణాముపలాయంతీం మదాల‌సాం మంజుల‌వాగ్విలాసామ్‌
మాహేంద్రనీల‌ద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి॥

సామాన్యంగా మనం ఏపూజ ప్రారంభించినా, విద్యారంభం చేసినా విఘ్నేశ్వరుడి తరువాత తల‌చుకునేది సరస్వతీదేవినే. విద్యల‌కు సిద్ధిని ప్రసాదించే తల్లిని శరణాగతి వేడుతు ‘‘శ్రీగణేశశారదాగురుభ్యోనమ:’’ అంటూ ప్రారంభిస్తాం. చరాచరాత్మకమైన జగత్తంతా సరస్వతీశక్తిని ఆశ్రయించి జీవిస్తోంది. ‘‘దివ్యమైన ఆనందాన్ని ప్రసాదించే సరస్వతీదేవి పాదపద్మముల‌ను నేను శరణు వేడుతున్నాను’’ అంటాడు కవి మల్లినాథసూరి. ఈయన కాళిదాసు కావ్యాల‌ను తెలుగులోకి అనువదించిన గొప్ప పండితుడు.
ఒకవ్యక్తి సభలో రాణించాలి అనుకుంటే అతనికుండవల‌సినది రూపం, గుణం ఇవేవి కావు. శరీరంకంటే రూపం, రూపంకంటే జ్ఞానం, జ్ఞానంకంటే విద్య ఉన్నతమైంది. విద్యను ప్రకటించాలంటే వాక్కు ప్రధానం. వాక్కుకు అధిష్ఠాన దేవత సరస్వతి. మానవమాత్రులేగాక కాశీవిశ్వేశ్వరుడుసైతం ఏ శక్తివల్ల వాక్కును, బుద్ధిని, జ్ఞానాన్ని పొందుతున్నారో ఆశక్తి సరస్వతిదేవియే. ఆమెవ‌ల్ల‌ ప్రాణుల‌న్నింటికీ ఉలుకు,పలుకు మొదలైనవి ఏర్పడుతున్నాయి. అందుకే వేదవ్యాసుడు దేవీ భాగవత పురాణ రచన ప్రారంభించినపుడు ‘‘సర్వచైతన్యరూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి, బుద్ధింయాన:ప్రచోదయాత్‌’’ అంటూ ఆ శారదాదేవినే శరణు వేడాడు. 
సరస్వతి అంటే ప్రవాహమని అర్థం. దీపం నుండి కాంతి ఎలా ప్రసారిస్తుందో, అలాగే అమ్మ చైతన్యమే జగమంతా ప్రభవిస్తున్నది. అలాంటి అమ్మవారి నామాన్ని తచితేచాలు....బుద్ధిశక్తి జ్ఞానశక్తి ప్రవేశిస్తుంది. ‘‘వాగ్బుద్ధిజ్ఞానాధిష్టాత్రి సరస్వతి’’ అంటూ సరస్వతీదేవిని కీర్తిస్తున్నాయి శాస్త్రాలు. అది ఎలాగంటే...ఆదికాలంలో విరాట్పురుషుడైన శ్రీమన్నారాయణుడి నాలుకనుండి సరస్వతిదేవి ఉద్భవించిందని పురాణగాథ. నాలుక వాక్కుకు మూంలం. సృష్టికిమూల‌మైన పరమేశ్వరుని వాక్‌శక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి సమూహస్వరూపమే సరస్వతి అని శాస్త్రాలు వర్ణించాయి. 
దేవీ భాగవతంలో నారాయణుడు నారదునికి ఆ అమ్మవారి రూపాన్ని వర్ణిస్తు ‘‘కోటి చంద్రులు ఒకేచోట చేరితే ఎలాఉంటుందో అలాంటి తెల్ల‌ని కాంతితో ప్రకాశిస్తు, తెల్ల‌ని వస్త్రాన్ని ధరించి, చ‌ల్ల‌ని చిరునవ్వుల‌ను వెదజల్లుతొంది. రజోగుణం, తమోగుణం లేకుండా సత్త్వగుణమే ప్రధానంగా ఆ దేవి విరాజిల్లుతొంది. అటువంటి దేవిని బ్రహ్మాది దేవతందరూ కీర్తిస్తున్నారు’’ అంటూ దేవిని వర్ణిస్తాడు. సాక్షాత్తూ నారాయణుడే ఆమె మహిమను వర్ణించడం ఆమెయొక్క శక్తికి ప్రతీకని చెప్పవచ్చు. 
పూర్వం ఒకసారి సనక, సనందనాది ఋషులు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి వేదాంతవిద్యను ప్రసాదించమని కోరారు. దానికి సంతోషించిన బ్రహ్మ వారు అడిగిన విధంగా విద్య నేర్పేందుకు సిద్ధపడ్డాడు. కానీ....ఆశ్చర్యంగా ఆయన గొంతు పెకల‌డంలేదు. మాట ముందుకు పోవడంలేదు. ఆశ్చర్యపోయాడు బ్రహ్మ.  ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచించాడు. విష్ణుమూర్తిని ప్రార్థించాడు. వెంటనే విష్ణువు సరస్వతిని ధ్యానించిన తరువాత పాఠం ప్రారంభించమని సూచించాడు. నారాయణుడు చెప్పిన విధంగా బ్రహదేవుడు వాగ్దేవతను స్మరించి సనకసనందనాదుల‌కు వేదాంతవిద్యను బోధించాడు. అదేవిధంగా వేయి పడగల‌ అనంతుడు సైతం సరస్వతిని స్తుతించి భూదేవికి జ్ఞానోపదేశం చేశాడు. వ్యాసమహర్షి అనేక పురాణ, ఇతిహాసాల‌ను రచించాడు.  బ్రహ్మవైవర్తపురాణం ప్రకృతిఖండంలో ఈకథనమంతా చక్కగా వివరించబడింది. 
ఒకనాడు యాజ్ఞవల్య్య‌మ‌హ‌ర్షి ముని శాపంతో తన విద్యల‌న్నీ పోగొట్టుకొని సూర్యుని సూచననుసరించి సరస్వతీదేవిని అనేక విధాలుగా ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో ఆయన సరస్వతీదేవి అవతార స్వరూపాన్ని చక్కగా వర్ణించాడు. సరస్వతీదేవి లేకుంటే జగత్తంతా బ్రతికిఉన్నప్పటికీ మరణించినదానితో సమానం. ఆమె అక్షరాల‌కు అధిదేవత. సత్పురుషులంతా ఆమెను విసర్గ, బిందు, మాత్రలకు మూలాధారంగా కీర్తిస్తారు. కాల‌స్వరూపిణి, వ్యాఖ్యాధిష్ఠాన దేవత, క‌ల్ప‌నాశక్తి ఆ దేవతే! 
సరస్వతిదేవిని ఎన్నో నామాల‌తో పిలుస్తారు. వాటిలో ‘‘శారదా’’ అంటే అజ్ఞానాన్ని నశింపచేసేదని, ‘‘భారతి’’  అంటే ప్రకాశ స్వరూపిణి అని, ‘‘యజ్ఞమయి’’ యజ్ఞస్వరూపమని అంటారు. అందుకే భారతంలో ‘‘అగ్నిహోత్రఫము`నాయొక్కపదము’’ అని చెబుతుంది అమ్మ. 
గాయత్రి, సావిత్రి స్వరూపాలు కూడా సరస్వతిదేవియే. గాయత్రి అంటే ప్రాణశక్తి. అదే ప్రాణశక్తి సరస్వతి. ‘‘ప్రాణశక్తిస్సరస్వతి’’ అంటూ వేదాలు సరస్వతిని కీర్తించాయి. విశ్వమంతా ఆవహించి ఉన్న ఏప్రాణశక్తి ఉన్నదో అదంతా సరస్వతీదేవి విభూతి. సృష్టి ప్రారంభానికి మూల‌మైన ప్రాణశక్తినే సావిత్రి అని చెప్పబడుతుంది. సర్వజీవుల‌ను రక్షించే ప్రాణశక్తిని గాయత్రి అంటారు. అలాగే ఋక్‌,యజుర్వేదాలో సరస్వతిని గురించి అనేక సూక్తాలున్నాయి. సర్వజీవులో చైతన్య స్వరూపిణిగా ఉన్నశక్తి సరస్వతీ దేవియే. అందుకే వేదాలు  ‘‘అంబితమే నదీతమే దేవితమే సరస్వతీ’’ అంటూ త‌ల్లుల‌లో, నదులో, దేవతలో, శ్రేష్ఠురాలు  అని కీర్తించాయి. 
మహాకవి  కాళిదాసుసైతం తన శ్యామలాదండకంలో చక్కని పదాతో ఆ జగజ్జననిని అద్భుతంగా వర్ణించాడు. శ్యామలాదేవి అంటే దశమహావిద్యలో ఒకవిద్య. ఇది పరిపూర్ణమైన విద్య. కాళిదాసుకు దేవిదర్శనమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించగా, ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన స్తుతించిన దండకమే శ్యామలా దండకము. 
ప్రసన్నమైన దేవి స్వరూపాన్నిచూస్తు కాళిదాసు ‘‘చతుర్భుజే చంద్రకళావతంసే’’ అంటూ ఎర్రని కుంకుమ రంగుతో, నాలుగుచేతులో చెరుకుగడలలు, పాశం, అంకుశం, పూల‌బాణాల‌తో  ప్రకాశించిన దేవిరూపాన్ని వర్ణిస్తుంటే, వెంటనే తనరూపాన్ని మార్చింది అమ్మవారు. దాంతో ఆయన ‘‘మాణిక్యవీణాముపలాయంతీం’’ అంటూ మరోశ్లోకాన్ని ఆశువుగా చెబుతు పారవ‌శ్యంలో మునిగిపోయాడు.  దేవి ఉపాసనా ఫలితాన్నివ్వ‌గ‌ల‌ శక్తివంతమైన దండకమే శ్యామలా దండకం. దీన్ని నిత్యం పఠించడం ద్వారా అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చు. 
మనిషి ఏపని చేయాలి...ఏది చేయగూడదు అనే విషయాన్ని ప్రేరేపించేది బుద్ధి. మనలోని బుద్ధిశక్తును ప్రేరేపించి సన్మార్గంలో నడిపించేది, సద్బుద్ధిప్రసాదించేది శారదాదేవి. ఆ దేవి కాశ్మీరంలో సరస్వతీదేవియై శక్తిరూపంలో వెలిసి భక్తుల‌ను అనుగ్రహిస్తున్నది. శక్తిపీఠాన్నింటిలోకి సరస్వతీదేవి పేరుతో ఉన్నది ఒక్కకాశ్మీరంలోనే. మన తెలుగురాష్ట్రాలో  అందుబాటులో ఉన్నది బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవాయం. అమ్మవారు ఇక్కడ వ్యాసభగవానుడిచేత ప్రతిష్ఠింపబడి పూజల‌నందుకుంటోంది. దేవి అనుగ్రహంవల్ల‌ లౌకికవిద్యలేగాక, పారమార్థికమైన విద్యల‌ను కూడా పొందవచ్చు.
ఆమెను స్తుతించేందుకు త్రిమూర్తులు, ఇంద్రాదిదేవతలు కూడా సమర్థులు కాలేరట! అటువంటి పరిస్థితుల‌లో అతి సామాన్యమైన మనమెంతటివారము! కానీ యథాశక్తినిగా ఆమెను ఆరాధించి పూజించితే చాలు... భక్తుల‌కు సులువుగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆమె దివ్య దయావీక్షణాల‌చేత వాగ్దాటి, మేధ విద్య, జ్ఞానం మనకు ల‌భిస్తాయి. 
అప్పాల‌ శ్యామప్రణీత్‌ శర్మ అవధాని
వేదపండితులు
సెల్‌:9440951366




Share on Google Plus

About https://vaidikagrandhanidhi.blogspot.com/

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment