-----------------------త్రిసుపర్ణమంత్రవిశిష్టత-మంత్రార్థం-----------------------
భగవంతునియొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలనుండి ఆవిర్భవించింది వేదం. అది మన ధర్మానికి, సంస్కృతికి మూలం. అనాది కాలంగా మన విశ్వవాఙ్మయంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంతరించుకున్నది వేదం. ఇది అత్యంత ప్రాచీనమైనది. భారతీయ సంస్కృతికి తేజస్సును, బలమును ప్రసాదించిందీ వేదమే!. ఈ వేదం.... విజ్ఞానమనే సరస్సులో ఉదయించి సంస్కార సౌరభాలను వెదజల్లే కమలమని భారతీయ తత్త్వవేత్తలు వ్యాఖ్యానించారు. ఈ వేద వాఙ్మయంలో నిక్షిప్తమైన కవితా వైభవం, భావచిత్రణ, ఆలోచనా సరళి, శిక్షణా విధానం, మానవాతీతమైన లోకోత్తర శక్తిదే అని అంగీకరించక తప్పదు. ఇన్నివేల సంవత్సరాలుగా ఒక జాతి ఆలోచనను, అనుబంధాలను సూత్రబద్ధంచేసి శాసించిన ఏకైక వాఙ్మయం వేదం. విజ్ఞానాన్ని, పవిత్రతను సమ్మేళితం చేసుకున్న ధర్మధ్వని ఇది. ''వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః'' అని భగవద్గీతలో సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పిన విషయం. అంటే సమస్త వేద శాఖలచేత నేనే తెలియబడేవాడిని అని అర్థం.వేదములలో అనేక దేవతాస్తుతులు ఉన్నాయి. ఆ అనేక దేవతలు ఒకే పరమాత్మకి అవయవాల వంటివారు. ఇదే విషయాలను అనేక మన్ర్తాలు ప్రతిపాందిచాయి. అటువంటివాటిలో కృష్ణయజుర్వేదములోని త్రిసుపర్ణం అనే మన్ర్తాల సముదాయం కూడా ఒకటి. ఈ త్రిసుపర్ణం బ్రహ్మజ్ఞాన ప్రతిబంధకాలైన ఏ మహా పాతకాలున్నాయో ఆ పాపరాశుల నాశనం కొరకు ఎల్లప్పడు జపింపతగ్గది. అటువంటివాటిలో బ్రహ్మహత్య అనేది పంచమహాపాతకములలో ఒక మహాపాతకము. ఇది చాలా తీవ్రమైన దోషం. దీనికంటే భ్రూణహత్య, వీరహత్య మొదలైనవి అధికమైన దోషప్రభావం కలవి. ఇటువంటి మహాపాతకాలను కూడా నాశనం చేయగల శక్తి త్రిసుపర్ణ మన్త్రాలకు మాత్రమేఉంది. అమోఘమైన పాపరాశినే ధ్వంసంచేసే శక్తిగల ఈ మంత్రాలకు, సురాపానం మొదలైన పాపాలను నాశనము చేసే శక్తిగురించి వేరే చెప్పేదేముంది.
''నా పృష్టః కస్య చిద్బ్రూయాత్సస అనే శాస్త్రవాక్యాన్ననుసరించి గురువు శిష్యుడు అడగకుండా విద్యలను చెప్పకూడదు. అయితే ఈ త్రిసుపర్ణమంత్రములను మాత్రం బ్రాహ్మణుడు అయినవానికి అడగకుండానే చెప్పాలి. ఇక ఈ త్రిసుపర్ణ మంత్రములయొక్క నిరంతర జపంచేత ఆ బ్రాహ్మణుడు పరిశుద్ధుడు అవుతాడు. పంక్తిబాహ్యులు ఉన్నాసరే! ఆ బ్రాహ్మణుడు ఏ పంక్తిలో భోజనం చేస్తాడో ఆ పంక్తిలోసహస్ర పర్యంతంగా వారందరినీకూడా పునీతులుగా చేయగలడు. ఇంకా సోమయాగాన్ననుష్ఠించిన ఫలితాన్ని పొందుతాడు. లోకాలన్నింటినీ సస్యశ్యామలంగా చేయగల సమర్థుడవుతాడు.
ముగ్గురు పక్షి స్థానీయులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనగా విశ్వతేజస ప్రాజ్ఞులుకానీ, విరాట్-హిరణ్యగర్భాంతర్యాములు గానీ, ఎవరి వలన ఉత్పన్నులు అయినారో అతడే త్రిసుపర్ణుడు. అంటే సర్వదేవతా సమిష్టి స్వరూపుడగు పరమాత్మ. ఆ పరమాత్మను గురించి చెప్పడంవల్ల ఈ మూడు మంత్రాలను త్రిసుపర్ణము అని అంటారు. ప్రణవప్రతిపాద్యుడైన పరమాత్మయే ఈ త్రిసుపర్ణానికి అధిష్ఠాన దేవత.
ఈ మూడు మంత్రములలోని మొదటి మంత్రములో పరబ్రహ్మ ప్రాప్తికి సాధనమైన ఉపాసన చెప్పబడింది. ద్వితీయ మంత్రములో జ్ఞానము చెప్పబడినది తృతీయ మంత్రములో కర్మకు పరమాత్మ ప్రాప్తి సాధనత్వము చెప్పబడినది .ఈ త్రిసుపర్ణ మంత్రములలో ఉన్న ఆధ్యాత్మిక విషయ విశేషాలను పరిశీలిద్దాం.
1. మొదటిమంత్రంః- బ్రహ్మమేతుమామ్...... ఓమ్'' ఇతి. ఈ మంత్రముయొక్క అర్ధము.....పరబ్రహ్మ నన్ను అనుగ్రహించుగాక! (పొందుగాక!). పరమానంద మాధుర్యోపేతమగు వస్తువు నన్ను పొందుగాక! మధురమగు పరబ్రహ్మయే నన్ను పొందవలెను గానీ ఇతరమైన కక్షుద్రదైవతములు పొందకూడు(డమా) బ్రహ్మ విద్యతో కూడా వర్తమానుడవు అగు ఓ పరమాత్మా ! నీ వలన జన్మించిన దేవ మనుష్యాది ప్రజాసృష్టిలో నే సేవకుడైన నేను బాలుని వలే కరుణాకాక్ష యోగ్యుడను. సంసారమనెడి దుస్వప్నమును నాశనము చేసే ఓ పరమాత్మా! నన్ను ఈ సంసార రూప దుఃఖము నుండి తరింపచేయుము. ఓ పరమాత్మా ! నా యొక్క ''జిహ్వే కీర్తయ కేశవం....'' మనోవాగాది ప్రాణవృత్తులు నీ చేత నిర్మితములు. కావున అవి నీ సంబంధమైనవి. అందువలన ఆ మనోవాగాది ప్రాణవృత్తులను నీయందే ఉపసంహారము చేయుచుింని అనగా విషయ సుఖములనుండి ఇంద్రియములను నివర్తింపచేసి నీయందే లగ్నము చేయుచుింని. ఈ ప్రథమ మంత్రముయొక్క జపము చేత విప్రుడు బ్రహ్మహత్యా ప్రయుక్త పాపమునుండి విముక్తుడగు చున్నాడు.
2. బ్రహ్మ మేధయా............... భవన్తు నః '' అని. ద్వితీయ మంత్రముః- దీని అర్థము...సర్వజగత్తునకూ కారణమైనటువిం, సర్వవేదాన్త వాక్య వేద్యమైనటువిం పరబ్రహ్మ. అస్మద్గురువులచే ఉపదేశింపబడిన మహావాక్యార్థములయొక్క ధారణచే మమ్ములను పొందుగాక! అట్లే మాధుర్యోపేతమైన ఆ పరబ్రహ్మ తత్త్వము మాత్రమే శ్రుత్యుక్త మహావాక్యములయొక్కయూ, తదర్థములయొక్క ధారణ చేత మమ్ములను పొందుగాక! మా బుద్ధులను ప్రేరేపించెడి ఓ పరమాత్మా ! ఈ దినమందు విద్యార్థులమగు మాకు భవిష్యత్తులో శిష్య ప్రశిష్యాది ప్రజోపేత సౌభాగ్యమును, అటులనే ఆచార్యత్వ సామర్థ్యమును ప్రసాదించుము. దుస్వప్న సదృశము అగు ద్వైత ప్రతిభాసను నిరాకరించి అద్వైత జ్ఞానభిక్షను ప్రసాదించుము. ఓ పరమాత్మా! జ్ఞాన ప్రతిబంధకములగు మాయొక్క సర్వ పాపములను నశింపచేయుము. కళ్యాణస్వరూపమైన మంగళ ప్రదమగు తత్త్వ జ్ఞానము (అనగా అసంభావనా, విపరీత భావనా రహితమగు దానిని) ఉపాసకుడనైన నాకు సంపూర్ణముగా అనుగ్రహింపుము. రజ్జుత్వభావ స్వభావం, సరలత్వ భావన అలాగే ప్రపంచ విషయంలో పరబ్రహ్మ తత్త్వమును కోరేటటువిం నాకొరకు వాయువులు సుఖముగా వీచుగాక! అనగా శైత్య, మాంద్య, సౌరభ్యములతో కూడిన మంచి గాలి మమ్ములను పొందుగాక. వాయువు ప్రబలమైనచో రోగోత్పత్తికి కారణమగును. తద్వారా తత్త్వ జ్ఞానానికి విఘ్నము కలుగును. అి్ట విఘ్నములు లేకుండుట కొరకు వాయువు యొక్క అనుకూల్యము ప్రార్థింపబడుచున్నది. ఇదే ప్రకారముగా నదులు కూడా మా కొరకు మధురమైనటువిం, ఆరోగ్యకరమైనటువిం ఉదకములను ప్రసాదించుగాక! అటులనే వ్రీహి, యవాది సమ ఓషదులు కూడా మాకు మధురములు (పధ్యరూపములు) అగుగాక! మరియూ చక్కి వెన్నెలతో కూడిన చల్లని రాత్రియూ, మంచి ఉషఃకాలము మాకు కలుగు గాక! అనగా కాలకృత విఘ్నములు లేకుండుగాక. భూమియందలి రజస్సు కంటక పాషాణాదులు లేకుండా నాకు అనుకూలమగు గాక! అనగా మేము సంచరించు ప్రదేశముగానీ, శయనించు ప్రదేశము గానీ, మెత్తగా ఉండుగాక! మాకు పితృ సదృశమగు ద్యులోకము కూడా అతివృష్టి, అనావృష్ట్యాది ప్రాతికూల్య రహితము అగుగాక! మామిడి, పనస మున్నగు వనస్పతులు కూడా మధుర ఫలోపేతులై జీవన హేతువులు అగుగాక! సూర్యుడు కూడా అధిక సంతాపము చేయకుండా మాకు అనుకూలమైన ప్రకాశముతో కూడినవాడు అగుగాక! గోమాతలు కూడా మమ్ములను గూర్చి జీవన హేతువులగు మధుర క్షీరములతో యుక్తములగుగాక! ఈ ద్వితీయ మంత్ర ఉపాసన చేయుట చేత భ్రూణహత్యా ప్రయుక్త మహాపాపము యొక్క నివృత్తి కలుగును. ''భ్రూణహత్య'' అనగా బ్రాహ్మణ గర్భస్థ శిశు హననము మరియు క్షత్రియ గర్భస్థ శిశు హననము అని అర్థము.
3. ''బ్రహ్మ మేధవా .............అమృతస్య ధారామ్'' ఇది తృతీయ మంత్రము. దీని వివరణ. బ్రహ్మ జ్ఞాన ప్రాప్తికి యజ్ఞము, దానము, తపస్సు, మొదలైనవి వివిదిషోత్పాదన ద్వారా సాధనమగుటచే బ్రహ్మ యజ్ఞము కలిగినది. అట్లే మధురమైన బ్రహ్మ పదార్థము కూడా యజ్ఞము కలది.
పరమాత్మ అగ్నీంద్రాది దేవతలలో చతుర్ముఖ రూపుడై నియామకుడు అగుచున్నాడు. కావ్యనాటకాది కర్తలగు కవీశ్వరులలో వ్యాకరణ నిష్పన్న సుశబ్ద సామర్థ్యాభిజ్ఞులై వ్యాస వాల్మీక్యాది రూపుడు. వైదిక మార్గవర్తులగు బ్రాహ్మణులలో గోత్ర ప్రవర్తుడగు వసిష్ఠాది రూపుడు. అటులనే చతుష్పాత్ పశువులలో అతి బలం కలిగిన మహిష రూపుడు. గృధ్రోపలక్షితములగు సర్వ పకక్షులలో ప్రబలమగు శ్యేనరూపుడు. వృక్ష సమూహ రూపములగు వనములకు ఛేదనార్థమగు పరశు రూపుడు. యాగ హేతుభూత సోమలతారూపుడై మంత్ర శబ్ద యుక్తుడగుచూ శుద్ధి కారణమైనటువిం గంగా జల, కుశ దర్భాది పవిత్ర ద్రవ్య జాతమును అతిక్రమించు చున్నాడు.
ఏ పురుషుడు వివేకముచే మాయను పరిత్యజింతునో ఆ పురుషునకు జగత్తు యంతయు బ్రహ్మ రూపముగ భాసించును అనే భావన ఈ మంత్రమునందు ప్రదర్శించబడుతోంది. దీని కొఱకై ఆదియందు జగత్తు అనువదించబడుతున్నది. ఎల్లప్పుడు గమనము చేయు ఆదిత్య రూపుడు, పరిశుద్ధమగు జ్యోతిర్మండలమునందు ఉండువాడు, సూత్రాత్మ రూపుడుగ జగన్నివాస హేతువు, ధూమ, జ్వాలా రూపుడుగ అంతరిక్షమందు ఉండువాడు. హోమనిష్పాదకుడగు ఆహవనీయాద్యగ్ని రూపుడగుచు సోమయాగమునకు సంబంధించిన వేదియందు ఉండువాడు, అతిథి సదృశుడగుచు యాగ గృహములందు ఉండువాడు, మనుష్యులయందు జఠరాగ్నిరూపుడుగ ఉండువాడు, కాశీ, పూరీ లాిం పవిత్ర క్షేత్రములందు ఉండువాడు, యజ్ఞమందు ఫలరూపుడుగ ఉండువాడు, ఆకాశమందు సూర్యరూపముగ ఉండువాడు, వృష్టిధార రూపములగు ఉదకములందు వైద్యుత రూపము జనించువాడు, గోకార్యమగు ఘృతమందు జ్వాలారూపముగా ఆవిర్భవించువాడు, యజ్ఞము కొఱకే సముత్పన్నమైనవాడు, పాషాణముపై పాషాణాంతర సంఘర్షణచే అగ్ని రూపముగ ఉత్పన్నుడు, ఇవన్నియు సత్యమగు పరబ్రహ్మయే.
లేక ఇి్ట అగ్ని ప్రౌఢమగు యజ్ఞమును నిష్పాదన చేయుగాక ! ఈ ప్రకారముగా బహుస్థలములయందు బహు రూపములుగ ఉంటున్నాడు. అజ్ఞాని దృష్టిలో జగత్తు ఈ విధముగ ఉన్నప్పికి జ్ఞానికి ఇదంతయు కూడ బ్రహ్మ పదార్థముగా భాసిస్తుంది.
ఓ పరమాత్మా! ఋగ్వేద రూపుడవగు నీ కొరకు ఈ సమిధ అగ్నియందు ఉంచబడుచున్నది. ఋగుప లక్షితమగు వేదత్రయ ప్రాప్తికొరకు నిన్ను ఉద్దేశించి ఉంచబడుచు మరియు దేవతలచే పానము చేయబడియుండి నదీ సదృశములను ఆజ్య ధారలు నిన్ను గూర్చి స్రవించుచున్నవి. ఆ ఆజ్య ధారలు హృత్కోషవర్తయగు మనస్సుచే పవిత్రతమములైనవి. అనగా అంతరంగ పూర్వకముగ హోమము చేయబడినవి. అంటే అంతరంగ శుద్ధి లేకుండా చేస్తే అవి అపవిత్రములని భావము. ఇి్ట ఆజ్యాధారలను సమస్త దేవతల కొరకు హోమము చేసెదను.
జ్యోతిర్మయుడైన్టియు, బహు ద్రవ్యవంతుడైన్టియు, మధురమగు స్వర్గాది సుఖములను చేయున్టియు, సర్వ ప్రాణులయొక్క దేహము లనెడి (గూళ్ళను) నివాస స్థానములను ఆశ్రయుడైన్టి త్రిసుపర్ణుడు (పరమాత్మ) సర్వ దేవతలకొఱకు మధురములగు హవిస్సులను విభజించి ఇచ్చుచున్నవాడు అగుచు పూర్వోక్తమైన ఆజ్యధారలయొక్క మధ్య భాగముల యందలి ఆహవనీయమందు ఉండెను. స్మరణ మాత్రంచేత పాపాలను హరించువాడూ, అమృత ధారాతుల్యమగు హవ్య, ద్రవ్య పరంపరలను దేవతలకు అందచేయువాడగు ఆ త్రిసుపర్ణుని యొక్క (పరమాత్మయొక్క) సమీపమందు సప్త ఋషులు నివశింస్తున్నారు.
ఈ విధంగా త్రిసుపర్ణమంత్రాలలో ప్రతిపాదింపబడిన పరమాత్మ మనందరినీ సర్వధా రక్షించుగాక.
స్వస్తి.
---------------వేదమూర్తులైన బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి వ్యాసాన్ని వారి అనుమతితో
https://vaidikagrandhanidhi.blogspot.in ద్వారా మీకు అందించబడినది-----------

Blogger Comment
Facebook Comment