గోపద్మంపాట
ప్రథమ దశమీనాడు హిమపట్నమందు
ఇంద్రాది దేవతలు సభజేసిరంట,
సభలోన శ్రీకృష్ణస్వామి కూర్చుండే
భేరికిజామాయే ఆజ్ఞనిమ్మనిరి,
అడిగిరి దూతలు ఆ యమునితోను
అడిగిన వారికి ఆజ్ఞలిచ్చిరి,
సూతులు పలుకుదురు సనకాదులకును
.........
గరుడవాహనమెక్కి శ్రీకృష్ణుడపుడు
శీఘ్రాన యేతెంచే సుభద్రకడకు
చెల్లెలా వ్రతములేమిజేసితివి ?
అన్నీను వ్రతము ఆచరించుమా
గోపద్మమనేటి వ్రతము స్త్రీలకును
వెన్నుడా నీవంటి అన్న ఉండంగా
చెప్పరా శ్రీకృష్ణదేవ నాతోనూ
పూర్వకాలమందు ఎవరుజేశిరి?
మునులుజేసిరి వారు ఋషులుజేసిరి
అజ్ఞాతవాసాన ద్రౌపదిజేసే
కుంతికి మొదలైన స్త్రీలుజేశిరి
ఏ మాసమందున ఏపక్షమందు
ఏ దేవుని పూజా ఇది ఏమి దేవా
ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలు
కార్తిక శుద్ధ ఏకాదశి దాకా
చాతుర్మాస్యాలు నాలుగునెలలు వ్రతముజేసి
కృష్ణప్రతిమను తెచ్చిపూజించి లెస్స
గోశాలయందైన తులసి వనమందు
గోమయమున అరుగు కొమురప్ప అలికి
పంచెవన్నెల ముగ్గుల పద్మము పెట్టి
గదానుపద్మము గరుడ వాహనము
అరటి స్తంభాలనే మంటపం పెట్టి
అరవై ఆరు వత్తుల దీపము పెట్టి
అందులో కలశము స్థాపితముజేసి
దీపమ్ము ధూపమ్ము నైవేద్యముబెట్టి
ఐదేండ్ల వాయనము సుభద్ర ఇచ్చే
ఐదురూపాలతో అచ్యుతుడు పొందే
అచ్యుతుడు తానాయే అన్నతానాయే
బ్రాహ్మణుడు తానాయే బ్రహ్మతానాయే
క్షీరసాగరమందు శేషు తానాయే
ద్వారము ముందరి పొగచూసి వారు
మరలిపోయి చెప్పిరి ఆ యమునితోను
ద్వారము ముందర ఐరావతమ్ము
ప్రాణమ్ము సరిపడి ఉన్నదని చెప్పిరి
దాని చర్మము తెచ్చి భేరివేయించే
కృష్ణ హేకృష్ణ హేకృష్ణమ్మజేతు
నాథుడు ఏలే సుమి నారాయణుడు
గరుడహే గరుడహే గరుడ వాహనుడా
కాళీయ మర్దన కాచి రక్షించు
అజ్ఞాన చీకట్లు అటు పారద్రోలు
సుజ్ఞాన బ్రహ్మముజూపి రక్షించు
పాపము బంధము పాపి రక్షించు
నీచరణాల కిందికి చేర్చుకో కృష్ణ
నీపుణ్య చరణాలు నాకు దయజేయి
ఎక్కువ శ్రీకృష్ణ ఏమి నిన్నడగ
చక్కగా వైకుంఠ పదవి నాకిమ్ము
అంత్యకాలమందు ఆ సమయమందు
ఆది నారాయణ స్మరణ నాకు దయజేయి
నామీద పారేటి పాపాలు అన్ని
పారగద్రోలుమ పరమాత్మ కృష్ణ
పాయే సుమీ పాపాలు పొందు పుణ్యాలు
ఈపాట ఎవరు పాడినా విన్నా
సతులకు సౌభాగ్య సంపదలు కలుగు
ఈపాట ఎవరు పాడినా విన్నా
సతులకు సౌభాగ్య సంపదలు కలుగు

Blogger Comment
Facebook Comment